![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -306 లో..... భద్రం చేసిన మోసాన్ని శ్రీలత వాళ్ళకి చెప్తుంది రామలక్ష్మి. వాడొక పెద్ద ఫ్రాడ్.. వాడిని నమ్మి మోసపోయారని రామలక్ష్మి చెప్తుంది. రేపటి వరకు అందరి డబ్బు ఇవ్వకపోతే అందరిని తీసుకొని వచ్చి గొడవ పెడతానంటూ రామలక్ష్మి అందరికి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు మురళి దగ్గరికి సీతాకాంత్ వెళ్లి భద్రం పెద్ద మోసగాడు.. కావాలంటే టెస్ట్ చెయ్యండి.. ఇప్పుడు పెట్టే పెట్టుబడి మొత్తం బ్యాంకు ట్రాన్సక్షన్స్ కావాలని అనండి అని సీతాకాంత్ చెప్పగానే.. భద్రంకి మురళి ఫోన్ చేసి అలాగే ట్రాన్సక్షన్స్ కావాలని అంటాడు. దానికి భద్రం సరే అంటాడు.
మీరు ఇప్పుడు చెప్పారు కదా మాటల్లో సరే అన్నాడు.. చేస్తాడేమో చూడండి. అప్పుడు మీకు అర్ధం అవుతుందని సీతాకాంత్ అనగానే ఇదొక్కసారి నీ మాట వింటానని మురళి అంటాడు. ఆ తర్వాత ఈ ఆలోచన మురళిది కాదు కచ్చితంగా ఆ సీతాకాంత్ వెళ్లి ఉంటాడు. ఇక నేను ఆలస్యం చెయ్యకూడదు త్వరగా ఈ డబ్బుతో వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఆ తర్వాత భద్రంకి శ్రీలత కాల్ చెయ్యమని సందీప్ ధన లకి చెప్తుంది. వాళ్లు ఫోన్ చేస్తుంటే భద్రం లిఫ్ట్ చెయ్యడు.
ఆ తర్వాత కాసేపటికి భద్రం ఫోన్ లిఫ్ట్ చేసి నేను కావలసినంత డబ్బు సంపాదించుకున్నాను.. ఇక నేను వెళ్లిపోతున్నానని డైరెక్ట్ గా చెప్పేస్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఇప్పుడేం చెయ్యాలంటూ అందరు కంగారుపడతారు.. అన్నింటికి ఒకడే సొల్యూషన్ అతనెవరో నాకూ తెలుసు ఎక్కడుంటాడో నాకూ తెలుసని శ్రీలత అంటుంది. మరొకవైపు త్వరగా భోజనం తీసుకొని రా అంటూ సీతాకాంత్ అరుస్తుంటాడు. అప్పుడే రామలక్ష్మి భోజనం తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |